మానవుని జీవితంలో ఒకరికి ఉపకారం చేయటం, మరొకరి సహాయం తీసుకోవటం చాలా సహజం. అయితే మనం ఒకరి వద్ద సహాయం తీసుకుంటే వారి పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయం గురించి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పారు. ఆ కదా ఇప్పుడు మనం చూద్దాం!
ఒకానొక సమయంలో కాశీ దేశంలో ఒక వేటగాడు ఉన్నాడు. ఆ వేటగాడు ఒకసారి వేటకు వెళ్లి ఒక జింకను వెంబడించాడు. ఆ జింకకు గురిపెట్టి ఒక విషపూరితమయిన బాణమును వదిలాడు. ఆ జింక ఆ బాణం నుండి తప్పించుకుని పారిపోయింది. ఆ బాణం తిన్నగా వెళ్లి ఒక పెద్ద చెట్టుకు తగిలింది. చాలా పువ్వులతో, కాయలతో అద్భుతంగా ఉన్న ఆ చెట్టు ఒక్కసారిగా ఆ బాణమునకు ఉన్న విషం కారణంగా నిర్జీవం అయిపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక కాపురం ఉండేది.
ఆ చెట్టు నిర్జీవంగా మారినా, ఆ చిలుకకు ఇప్పుడు ఏ సహాయం చేసే స్థితిలో లేకపోయినా, ఆ చిలుక ఆ చెట్టు తొర్రలోనే నివసిస్తూ ఉంది. ఎండ, చలి,వర్షం వంటి ఏ పరిస్థితి లోనూ ఆ చిలుక ఆ చెట్టును వదిలిపోలేదు. కారణం ఆ చెట్టు ఇంతకు ముందు ఆ చిలుకకు ఆశ్రయం కలిగించుట వలన కలిగిన గౌరవ మర్యాదలు. ఏమి జరిగినా తనకు ఎంతో సహాయం చేసిన ఆ చెట్టును వదిలి పోకూడదు అని ఆ చిలుక దృఢసంకల్పం గురించి ఇంద్రునికి తెలిసింది. ఆ చిలుకను పరీక్షిద్దామని ఇంద్రుడు మానవ రూపంలో ఆ చిలుక దగ్గరకు వచ్చాడు.
ఆ చిలుకను చూసి ఇంద్రుడు "ఓ చిలుకా, ఈ అడవిలో ఎన్నో పుష్పించిన, ఫలములు ఉన్న చెట్లు ఉండగా నీవు ఈ ఎండిపోయిన చెట్టు తొర్రలో ఎందుకు ఉంటున్నావు ?" అని అడిగాడు.
ఆ మాటలు విన్న చిలుక "ఓ దేవేంద్రా ! మనకు సహాయం చేసిన వారిని అంటిపెట్టుకుని ఉండుట మన ధర్మం కదా! ఈ వృక్షం ఫలములతో పుష్పములతో ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చింది, ఇప్పుడు దీనికి ఆ శక్తి లేదు, ఆశ్రయం ఇచ్చినప్పుడు తీసుకుని, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం మనకు సహాయం చేసిన వారిని వదలి వెళ్ళిపోతే కృతఘ్నత అవుతుంది కదా!"అని సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న దేవేంద్రుడు, నేను మారువేషంలో వచ్చినా ఈ చిలుక నన్ను గుర్తుపట్టింది అంటే అది దీని పూర్వజన్మ శుభఫలముల వలెనే కనుక తానూ ఆ చిలుకకు సహాయం చేయాలి అని కున్నాడు.
అప్పుడు ఆ చిలుకతో "ఓ చిలుకా! నీవు చెప్పిన ధర్మమునకు నేను ఏంటో సంతోషించాను, నీకు ఏదయినా వరం ఇవ్వాలి అనుకుంటున్నాను నీకు ఏమి కావాలో కోరుకో" అన్నాడు. ఆ మాటలు విన్న చిలుక "ఓ దేవేంద్రా! ఈ వృక్షమునకు తిరిగి పూర్వ స్థితి కలిగించు అని చెప్పింది"
ఆ మాటలు విన్న దేవేంద్రుడు అత్యంత సంతోషించి ఆ చెట్టు మీద అమృతం చల్లి , ఇంతకూ ముందు ఉన్న వైభవం కంటే ఇంకా ఎక్కువ వైభవమును కలుగజేసాడు.

మనం మనకు సహాయం చేసిన వారికి కష్టం కలిగిన పరిస్థితిలో వారికి తిరిగి మన సహాయమును అందించాలి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి