శివుని ధనస్సును పినాకం అంటారు. దాని వల్లనే శివునికి పినాక పాణి అని పేరు వచ్చింది. అయితే ఆ పినాకమును ఎవరు తయారుచేసారు ? దానిని శివునకు ఎవరు ఇచ్చారు? దీనికి సమాధానం స్వయంగా శివుడే పార్వతికి చెప్పిన ఘట్టం మనకు మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కనిపిస్తుంది.
మనం ఇంతకూ ముందు కల్పములు మరియు యుగములు గురించి చెప్పుకున్నాం కదా! వాని లోని మొదటి కల్పంలోని మొదటి కృతయుగంలో కణ్వుడు అనే మహర్షి మహానిష్ఠ కలిగి అత్యంత కఠినమయిన తపస్సు చేసాడు. ఆటను తపస్సులో లీనమయ్యి ఉండగా, అతని శరీరంమీద పెద్ద పుట్టలు ఏర్పడ్డాయి. పుట్టమీద ఒక వెదురు మొక్క జన్మించినది. ఆ వెదురు మొక్క సహజంగా కాక అతని తపస్సు వలె అత్యంత గొప్పగా పెరిగింది. దాని పొడవు, వెడల్పు చాలా ఎక్కువగా పెరిగాయి. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వరములను ఇచ్చాడు.
ఆ వెదురుని బ్రహ్మదేవుడు తనతో తీసుకుని వెళ్ళాడు. దానిని విశ్వకర్మకు ఇచ్చి రెండు విల్లులు చేయమన్నాడు. అలా తయారయిన విల్లులే శివుని చేతిలో ఉండే పినాకం, ఇంకా శ్రీ మహా విష్ణువు చేతిలో ఉండే శారఙము. ఆ రెండు ధనస్సులే కాక మిగిలిన చిన్న ముక్కతో మరొక విల్లును తయారుచేసాడు విశ్వకర్మ. ఆ మూడవ ధనస్సే అర్జునుని చేతికి వచ్చి చేరిన గాండీవము.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి