మనం ఏదయినా న్యాయసంబంధమయిన విషయములు చర్చించవలసి వస్తే, ఆ సమయంలో ముఖ్యంగా పరిగణలోనికి తీసుకునేది సాక్ష్యుల వాంగ్మూలములు. మరి మన శాస్త్రములలో చెప్పిన సాక్ష్యములు ఎన్ని రకములు ఏమిటి? ఇప్పుడు చూద్దామా!
మన శాస్త్రములు చెప్పినదాని ప్రకారం సాక్ష్యములు పదకొండు రకములు. ఈ పదకొండు రకముల సాక్షులను తిరిగి రెండు రకములుగా విభజించారు.
కృతసాక్ష్యులు : ముందుగానే నిర్ణయించబడిన సాక్ష్యులు. వీరు ఐదు రకములు.
- లిఖితుడు
- స్మారితుడు
- యదృచ్చాభిజ్ఞుడు
- గూడుడు
- ఉత్తరుడు
అకృతసాక్ష్యులు: ముందుగా నిర్ణయించ బడని సాక్ష్యులు. వీరు ఆరుగురు
- గ్రామస్థులు
- ప్రాడ్వివాక
- లేఖకసభ్యులు
- రాజు
- కార్యాధికారి
- వాదిచే పంపబడిన వాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి