మొన్న ఆ మధ్య ఒక మిత్రుడు ఈ ప్రశ్న వేసాడు. మన తెలుగు కధలు అన్నీ అనగనగా అనే ఎందుకు మొదలవుతాయి అని?
నాకు కూడా ముందుగా తెలియలేదు కానీ ఆలోచిస్తే ఒక సమాధానం దొరికింది. ఈ సమాధానం మీకుకూడా సమంజసంగా ఉంటుందేమో చూద్దామా!
ఈ మధ్య సినిమాలు, సీరియళ్లు చూస్తున్నప్పుడు వానికి ముందు "DISCLAIMER" అని ఒకటి వేస్తున్నారు కదా! అంటే ఈ సినిమాలోని పాత్రలు కేవలం కల్పితం ఎవరినీ ఉద్దేశించినవి కావు అని, అలాగే మన అనగనగా కూడా ఒక "DISCLAIMER" అని నా ఉద్దేశం.
అంటే ఈ కధ నేను చెప్పటంలేదు, నాతో ఎవరో అన్నారు, వారితో ఇంకెవరో అన్నారు, ఇలా అందరూ అనగనగా ఆ కధ నేను మీకు చెప్తున్నాను అని అయ్యి ఉంటుంది అని నా భావన.
ఒకవేళ మీకు ఎలా కాకుండా ఇంక ఏమయినా సమాధానం తెలిస్తే దయచేసి చెప్పగలరు!
Super yaarr
రిప్లయితొలగించండిధన్యవాదములు
రిప్లయితొలగించండి