భరతుడు, రామాయణం లోని అనేక వ్యక్తుల చేత అనుమానించబడిన వాడు. దశరధుడు, గుహుడు చివరకు తన సోదరుడయిన లక్ష్మణుడు కూడా అతనిని అనుమానించారు. అటువాని భరతుని గురించి శ్రీ రాముడు ఏమన్నాడో తెలుసా!
అర్హుడే అని వాల్మీకి రామాయణం చెప్తుంది. దానికి కారణం అతని హృదయంలోగల భాతృ భక్తి. దానికి ఈ కింద శ్లోకమే తార్కాణం.
న సర్వే భ్రాతర స్తాత భవంతి భారతోపమాః
అంటే భరతుని వంటి సోదరుడు ఎవరికయినాను లభించుట దుర్లభము అని అర్ధము. మరి శ్రీ రామునితో అంత చక్కగా తనగురించి చెప్పించుకున్న భరతుడు ఎలాంటి వాడు? నిజంగా శ్రీ రామునితో అటువంటి పొగడ్తలకు అర్హుడా?అర్హుడే అని వాల్మీకి రామాయణం చెప్తుంది. దానికి కారణం అతని హృదయంలోగల భాతృ భక్తి. దానికి ఈ కింద శ్లోకమే తార్కాణం.
అభిషేక్ష్యతి రామతు రాజా యజ్ఞంను యజ్ఞంను యక్ష్యతే!
ఇత్యహం కృత సంకల్పో హృష్టో యాత్రా మాయాశిషం!!
తదిదం హ్యన్యధా భూతం వ్యవదీర్ణం మనోరమ !!!
నేను ఏంతో సంతోషంగా తాతగారి ఇంటికి వెళ్ళాను. నేను అటు వెళ్ళగానే తండ్రిగారి అన్నగారయిన శ్రీరాముని రాజుగా ప్రకటించి, పట్టాభిషేకం చేసి ఆ తరువాత యాగాన్ని కూడా జరిపించి ఉంటారని అనుకున్న. ఈ శ్లోకమునకు ఉన్న అర్థమును చూసి మన పెద్దలు భరతుని వ్యక్తిత్వమును చాలా చక్కగా విశ్లేషించారు. భరతుడు ఈ విధంగా అనుకున్నాడు అంటే, అతను శ్రీరామ పట్టాభిషేకం అతని పరోక్షంలో జరగాలని అనుకున్నాడు. అలా ఎందుకు అనుకోని ఉండవచ్చు? 2 కారణములు
- భరతునికి రాజ్యకాంక్ష ఉండి శ్రీరామునికి పట్టాభిషేకం అవుతుంటే చూడలేక !
- భరతునికి దశరధుడు తన తల్లి కైకేయికి వివాహం జరిగిన సమయంలో ఆమె తండ్రికి ఇచ్చిన మాట తెలిసి.
ఈ రెండు సందర్భాలలో మొదటిది అసలు సంభవమే కాదు, ఒకవేళ తాను శ్రీరామ పట్టాభిషేకం చూడలేక అమ్మమ్మగారి ఇంట్లో ఉండగా పట్టాభిషేకం జరిగి పోవాలి అని కోరుకుంటే, అతను తిరిగి వచ్చాక రాజ్యం అకంటకంగా తన పరం అవుతున్నప్పుడు మరలా రామునికోసం అడవులలోనికి పరుగులు పెట్టాడు కదా!
అంటే దీనిని బట్టి మన పెద్దలు ఎలా విశ్లేషించారంటే భరతునికి దశరధుడు తనతల్లికి ఇచ్చిన 2 వరముల గురించి తెలిసిన తెలియక పోయినా, తన తాతగారికి దశరధుడు ఇచ్చిన వాగ్దానం బాగా తెలుసు. దశరధుని రాముని పైన గల ప్రేమ, రామునికి గ రాజ్య పరిపాలనా దక్షత , రాజ్యంలో ప్రజల కు రాముని పై గల ప్రేమ అన్ని తెలుసు. కనుక రాజ్యమును పరిపాలించే అవకాశం తనకు ఉంది తెలిసినా తన అన్నగారికి పట్టాభిషేకం జరగాలి అని కోరుకున్నాడు. మరి అటువంటి భరతుని గురించి రాముడు ఆలా చెప్పటం చాలా సబబే కదా!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి