సీ : స్థిరముగాదీ జన్మ చిరకాలముండంగా
ఎప్పుడు మరణంబొ చెప్పలేను
గ్రామమందో లేక గహన మధ్యంబునో
జలములందో లేక తలమునందో
అగ్నియందో లేక యారామ మందునో
గుట్టు చెట్టులుగాక పుట్టలందొ
పగటియందో లేక పాడు చీకటియందొ
పడిపోవు దేహంబు పసను విడచి
తే : దేవ మరణంబు వచ్చుట తెలియలేను
స్మరణ మాత్రము నీయందె స్థిరతనుండు
పుండరీకాక్ష నీవాడ బ్రోవు మెపుడు
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
ఎప్పుడు మరణంబొ చెప్పలేను
గ్రామమందో లేక గహన మధ్యంబునో
జలములందో లేక తలమునందో
అగ్నియందో లేక యారామ మందునో
గుట్టు చెట్టులుగాక పుట్టలందొ
పగటియందో లేక పాడు చీకటియందొ
పడిపోవు దేహంబు పసను విడచి
తే : దేవ మరణంబు వచ్చుట తెలియలేను
స్మరణ మాత్రము నీయందె స్థిరతనుండు
పుండరీకాక్ష నీవాడ బ్రోవు మెపుడు
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి