సీ : ధర్మంబులిడుమని దయను నేగోరను
కామ్యంబులొందను కాంక్షలేదు
అర్ధించగనులేను యర్ధంబునిమ్మని
మోక్షమిమ్మంచును ముదము గోర
దృడకాయమిమ్మని దృఢముగా నేవేడ
తపసి కావలెనను తపన లేదు
సతతంబు నీనామ స్మరణమే జేయుచు
గలిగినకాలంబు గడపుటకును
తే : కోరుచుండెద నామది కూర్మితోడ
ఇంత మాత్రమె నొసగను పంతమేల
క్రూ రుడని ఎంచినామీద కోపపడక
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామ్యంబులొందను కాంక్షలేదు
అర్ధించగనులేను యర్ధంబునిమ్మని
మోక్షమిమ్మంచును ముదము గోర
దృడకాయమిమ్మని దృఢముగా నేవేడ
తపసి కావలెనను తపన లేదు
సతతంబు నీనామ స్మరణమే జేయుచు
గలిగినకాలంబు గడపుటకును
తే : కోరుచుండెద నామది కూర్మితోడ
ఇంత మాత్రమె నొసగను పంతమేల
క్రూ రుడని ఎంచినామీద కోపపడక
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి