సీ : నీయందు చిత్తంబు
నిలుపనేర్వనివాడు
ఏ వేదములనేర్చి
నేమి ఫలము
చిత్తంబు నీయందు
జేర్చక యజ్ఞాదు
లొనరించ ఫలమేమి
మానవునకు
మాధవనేయందు మనసు
లేకొనరించు
పూజలు దానముల్
పూజ్యమగును
హరియందు చిత్తంబు
యమరకచేసెడి
గంగాది స్నానముల్
భంగమగును
తే : మాధవునియందు చిత్తంబు మరలుకొలిపి
చేయుకర్మంబులెల్లను
సిద్ధినందు
నేనశక్తుండని
విజేయ నిజముదేవ
అందుకొనవయ్య శ్రీరామ వందనములు!!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి