మహాపురణ
లక్షణములు పదిగా చెప్పబడినవి. అవి
- సర్గము : కారణ సృష్టి (బ్రహ్మ సృష్టి)
- విసర్గము : బ్రహ్మ సృష్టి ననుసరించి దక్ష,మరీచ్యాదుల సృష్టి
- వృత్తి : భూతములకు అవసరములయిన సాధనములు (భోజనం మొదలగునవి)
- రక్ష : దుష్టసంహారముకొరకు భగవానుని అవతారములు, వాని లీలలు
- మన్వంతరములు : 14మనువులు, ఆ మన్వంతరములలో దేవతలు, ధర్మములు
- వంశము : బ్రహ్మ మొదలు పరంపరనుగత శరీర సముదాయ ప్రవాహము
- వంశానుచరితము : ఒకొక్క వంశములోని మహాపురుషుల ఆచార, గుణ వర్ణనము
- సంస్థ : ప్రళయము
- హేతువు : సృష్టికి హేతుభూతుడగు జీవుని తెలుపునది
- అపాశ్రయము : ప్రస్థానత్రయమున కనిపించు విశ్వతైజసప్రాజ్ఞులు అనే మాయావృత్తులు మూడిటియందు పరమాత్మ ఏవిధంగా సాక్షిగా ఉంటాడో చెప్పటం.
ఉప పురాణ లక్షణములు ఐదుగా చెప్పబడినవి. అవి
- సర్గము
- ప్రతిసర్గము/ విసర్గము
- మన్వంతరములు
- వంశం
- వంశానుచరితం
ఉపపురాణములకు ఒకే కర్త ఉండవలసిన అవసరం లేదు. అంటే ఒకే ఉపపురాణములలో విషయములను అనేక మహర్షులు చెప్పు ఉండవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి