సీ : జన్మంబులెన్నొయీ
జగతిలోపలనెత్త
విసుగెంతయును లేదు వాసుదేవ
అనుభవించెడి కర్మలవియెన్నశక్యమే
శూలికైనను తమ్మి చూలికైన
నేనుజేసినస్తన్యపానంబునిజముగా
సప్తోదధులమించుసారసాక్ష
ఘోరాతిఘోరమౌ నరకంబులనెల్ల
దుఃఖమంచనకనుదూకినాడ
తే : అగ్రజుండను పాపులయందు
నేను
నిరయ మొందగనుంతిని నీరజాక్ష
నీదుభజనమె జేయుచు నిన్నువిడను
అందుకొనవయ్య శ్రీరామ
వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి