సీ : ఈరేడు లోకంబు లీశ్వరాధీనమై
భూతి ద్వయంబంచు బొగడ బడియె
దైవంబు
మంత్రమాధారమై యుండంగ
భక్తి ముక్తులకెట్లు భంగ మొదవు
మంత్రమాచార్యుని
మహిమకు లోబడి
సిద్ధి నందగ జేయు చేతనులకు
ఆచార్యు
కృపచేత హరియె ప్రత్యక్షమై
సర్వస్వదానము శక్తి నొసగు
తే : ఇన్నింటికి
మూలమాచార్యుడిష్టతముడు
భాగవతు లెల్లరతనికి పరమ హితులు
మూలమిది యన్నింటికి నండ్రు మోక్షమతులు
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి