మన శాస్త్రములలో చెప్పిన విషయములు వినటానికి కొంచెం కఠువుగా ఉన్నప్పటికీ నిర్దుష్టంగా సత్యం చెప్తాయి. ఇప్పుడు అటువంటి నిర్వచనముల గురించి తెలుసుకుందాం!
అవి నింద మరియు స్తుతి. వీనిని నిర్వచించు శ్లోకము చూడండి.
అవి నింద మరియు స్తుతి. వీనిని నిర్వచించు శ్లోకము చూడండి.
గుణేషు దోషారోపణం యసూయ అధవా దోషేషు గుణారోపణ యసూయ
తధా గుణేషు గుణారోపణం దోషేషు దోషారోపణం స్తుతిః
పైన చెప్పిన శ్లోకం ప్రకారం
నింద : ఒక వ్యక్తి గుణములను దోషములుగా, దోషములను గుణములుగా చెప్పటం నింద.
స్తుతి: ఒక వ్యక్తి గుణములను గుణములుగా, దోషములను దోషములుగా చెప్పటం స్తుతి.
విశ్లేషణ:
వినటానికి అర్ధం చేసుకోవటానికి కొంచెం విపరీతంగా ఉన్నా ఒక వ్యక్తి దోషములను దోషములుగా చూపటం కూడా స్తుతి అని చెప్పారు. అలా ఎత్తి చూపటం వలన ఆ వ్యక్తి తన దోషములను దూరం చేసుకునే అవకాశం పొందగలుగుతాడు.
నింద అంటే అతని దోషములను కూడా గుణములుగా చెప్పినప్పుడు అతనికి అతనిలోని లోపం తెలుసుకునే అవకాశం ఉండదు. అతని దోషమును తెలుసుకోలేని వారు, ఆ దోషమును దూరం చేసుకునే అవకాసం కూడా ఉండదు.
గుణములను దోషములుగా చూపినప్పుడు బలహీన మనస్సుకల వారయితే వారి గుణములను వదిలే అవకాశం కూడా ఉండవచ్చు.
మరో విధంగా చుస్తే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం స్తుతి, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కల్పించి చూపుట నింద.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి