మనం ఇంతకుముందు వేద వ్యాస జననం గురించి చెప్పుకునే సమయంలో సత్యవతి గురించి, ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసన (ఆ కారణంగానే ఆమెను మత్స్యగంధి అనే వారు) గురించి చెప్పుకున్నాం.
మనకు సహజంగా వచ్చే అనుమానం ఆమెకు చేపల వాసన ఎందుకు వచ్చింది? అసలు అలా ఎవరికయినా ఉంటుందా? అది కవి గారి కల్పనే గానీ? చాలామంది కొట్టి పారేస్తూ ఉంటారు.
కానీ మన పురాణములలో చెప్పిన విషయములు మన విజ్ఞాన శాస్త్రములకు అందవు కనుక అవి అన్ని అధ్బుతకల్పనలు అని అందరూ కొట్టి పారేస్తూ ఉంటారు. 18వ శతాబ్దం వరకు మన పురాణములలో తప్ప భౌతికంగా విమానం అంటే ఎవరికీ తెలియదు. తరువాత మన విజ్ఞాన శాస్త్రం అభివృధి చెందింది. విమానములు తయారు చేయబడ్డాయి. అలాగే ఇంకా చాలా విషయములు మన విజ్ఞానమునకు ఇంకా అర్ధం కావు.
ఈ మత్స్యగంధం గురించి ఇప్పుడిప్పుడే మన శాస్త్రవేత్తలు కొంత సమాచారం సాధించారు. ఈ వాసన రావటం అనే ఈ వైద్య పరిస్థితి కి "ఫిష్ ఓడర్ సిండ్రోమ్" అని పిలుస్తారట. అంటే మన తెలుగులో చేపల వాసన వచ్చే పరిస్తితి అని అర్ధం. ఇంతకీ దీనికి కారణం ఏంటంటే మానవుల చర్మ గ్రంధులలో ఉత్పత్తి అయ్యే "ట్రై మిథైల్ అమీన్యూరియ" అనే రసాయనం అట. సహజంగా ఈ రసాయనం అందరిలో కొంత మొత్తంలో ఉత్పత్తి అయినా దాన్ని తటస్థీకరించే వ్యవస్తను చర్మం కలిగి ఉంటుందట. ఒకవేళ ఈ రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అయిన సందర్భంలో ఆ వ్యవస్థ దెబ్బతిని అప్పుడు ఆ మనిషి నుండి చేపల వాసన వస్తుందట.
అదండీ సంగతి. ఇక ముందు మన శాస్త్రవేత్తలు ఈ మత్స్యగంధం పోయి అందరూ యోజనగంధులుగా మారే శాస్త్రీయతను నిరూపించగలిగితే బాగుంటుంది కదా!

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి