మనం ఇంతకు ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
మఖ నక్షత్రం
శ్లోకం : మఖాశ్చతు తారాశ్చపనస కృష్ణయుగాకృతిః
చంపక పుప్పతిత్తీరియ రత్న వైడూర్యం తధా!
చంపక పుప్పతిత్తీరియ రత్న వైడూర్యం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 36 నుండి 39 వరకు గల శ్లోకములు మఖ నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం : పైన చెప్పిన విధంగా చేయుట వలన కార్యములకు విఘ్నములు తొలగుతాయి. కుటుంబం, బంధములు బలోపేతం అవుతాయి. అనారోగ్యముల భాదలు తీరుతాయి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి