మనం ఇంతకు ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఉత్తర నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
వృక్షం : జువ్వి
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
ఉత్తర (ఉత్తర ఫల్గుణి) నక్షత్రం
శ్లోకం : ఉత్తరఫల్గుణీద్వితారాశ్చ వాలువృక్షదండాకృతి:
కృష్ణ వర్ణ కర వీరేచ క్రౌంచ పక్షౌ కెంపు రత్నం తధా!
కృష్ణ వర్ణ కర వీరేచ క్రౌంచ పక్షౌ కెంపు రత్నం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 45 నుండి 48 వరకు గల శ్లోకములు నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం: పైన చెప్పిన విధంగా చేయుట వలన వారికి జీవితంలో మంచి స్నేహితులు, దానివలన మంచి సలహాలు సమయమునకు అందుతాయి. మరియు వీరు స్వయంగా మరి కొందరికి సహాయం చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి