గర్వం అంటే పొగరుగా ఉండటమే కాదు, తను సాధువుగా ఎంతో సాధించేశాను అని అనుకోవటమ కూడా గర్వం అనే చెప్పారు పెద్దలు. చిన్న పిల్లలు పెద్ద తప్పు చేసినా చిన్న శిక్ష వేసి దారిలోకి తెచ్చే సంప్రదాయం మనది. అయితే ఎంతో జ్ఞానం సంపాదించి, సాక్షాత్తు బ్రహ్మకు పుత్రుడయిన నారద మహర్షి కి గర్వం వస్తే! చుడండి ఎలా ఉంటుందో !
ఒకసారి బ్రహ్మలోకంలో సకల దేవతలు సమావేశం అయ్యారు. అందరు దేవతలు అనేక విషయముల గురించి ముచ్చటిస్తూ విష్ణుమాయ గురించి మాట్లాడుకోసాగారు.
అప్పుడు బ్రహ్మదేవుడు, సదాశివుడు కూడా తమను విష్ణు మాయ ఏ విధంగా మోహింప చేసిందో చెప్తున్నారు. ఆ సమయంలో ఆ సభలో ఉన్న నారద మహర్షి చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వును గమనించిన దేవతలు ఆ నవ్వునకు కారణం అడిగారు. దానికి సమాధానంగా నారద మహర్షి తనను ఈ విష్ణుమాయ ఏ విధంగాను ప్రభావం చేయలేదు అని ప్రకటించారు. ఆ మాటలు విన్న పరమపిత బ్రహ్మదేవుడు నారదుని మందలించారు. అయినా వినకుండా నారద మహాముని మరలా ఆ విష్ణుమాయ తనను మొహంలో ఉంచలేదు అని ప్రకటించారు. అప్పుడు సర్వ దేవతలు నారదునికి స్వీయానుభవం అయితే తప్ప తెలిసిరాదు అని ఎవరి ధామములకు వారు వెళ్ళిపోయారు.
కొంతకాలానికి ఒకరోజు నారదుడు అరణ్యములలో తిరుగుతూ ఉండగా సంధ్యాసమయం అయింది. సంధ్యావందనం చేద్దాం అని ఏదయినా నీటి కొలను ఉందేమో అని చూసాడు. కొంతదూరం తిరుగగా అక్కడ ఒక కొలను కనిపించింది. ఆ కొలనులో దిగి స్నానాధికాలు కానిచ్చి సంధ్యా వందనం చేద్దాం అనే ఆలోచనతో ఆ కొలనులో మునిగిన నారదుడు, పైకి లేచేసరికి స్త్రీగా మారిపోయాడు. అంతే కాకుండా అతనికి ఇంతకుముందు ఏమి జరిగిందో, తను ఎవరోకూడా గుర్తు లేదు. అలా స్త్రీ గా మారిపోయిన నారదుడు ఆ అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు.
నారదుడు స్త్రీ గా మారిన ఈ కొలను పేరు నారద కుండం అయింది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి