ధనుష్కోటి కూడా మేలుకోటిలోని ఒక చూడ దగిన ప్రదేశం. మీరు శారీరిక ధారుడ్యం కలవారైతే తప్పకుండా చూడవలసిన ఒక అద్భుతమైన, అందమైన, సుమనోహరమైన ప్రదేశం. మీ శారీరిక ధారుడ్యంఅంత బాగోలేదు అనుకుంటే....... !
ఇంతక ముందు రాయగోపురం గురించి చెప్పుకున్నపుడు సీతారాములు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడకు వచ్చారు అని చెప్పుకున్నాం కదా! ఈ ధనుష్కోటి కూడా వారికి సంబందించిన ప్రత్యేకమైన ప్రదేశం.
సీతారాములు విహారం కోసం ఈ కొండపైకి వచ్చారట. అప్పుడు సీతామాతకు విపరీతమైన దాహం వేసిందట. ఆమె అవస్థ చుసిన శ్రీ రాముడు తన ధనుస్సు తీసుకుని ఒక బాణమును ఆ కొండయొక్క ఒక రాతి మీద ప్రయోగించారట. అప్పుడు ఆ రాతినుండి ఎప్పటికీ ఎండిపోని ఒక జల బయటకు వచ్చినదట. సీత మాత ఆ జలముతో తన దప్పికను తీర్చుకొన్నదట. ధనుస్సు ఉంది ప్రయోగించబడిన బాణము కొనవలన జలము ఉద్భవించినది కనుక ఈ ప్రదేశమును ధనుష్కోటి అని పిలిచారట.
ఈవిధంగా చెప్పబడిన ఆ జలం నేటికి కూడా ఎండిపోకుండా ఉన్నది. ఐతే ఆ నీరు త్రాగుటకు వీలుగా లేవు. ఐతే ఆ జలమును మనం తలపై ప్రోక్షించుకొనుటకు యోగ్యంగా ఉన్నవి.
ఆ ప్రక్కనే సీతారాముల ఆలయం ఉన్నది.
శ్రీ సీతా రాముల పాద ముద్రలు కూడా ఇక్కడ చూడ వచ్చు. ఐతే ఇక్కడ వచ్చిన తరువాత అక్కడి ప్రకృతి రమణీయత అత్యంత అద్భుతం.
ధనుష్కోటికి మేల్కోటి చెలువ నారాయణుని దేవాలయం నుండి రాయగోపురం మీదుగా నడచి చేరుకొన వచ్చును. ఐతే ఆ కొండ ఎక్కటం అంత తేలిక ఐన విషయం కాదు. అ కొండ క్రింది వరకూ కావాలంటే మీ వీలును బట్టి ఏదయినా వాహనంలో చేరుకొన వచ్చును.
my parents coming down from dhanushkoti
ఇంతక ముందు రాయగోపురం గురించి చెప్పుకున్నపుడు సీతారాములు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడకు వచ్చారు అని చెప్పుకున్నాం కదా! ఈ ధనుష్కోటి కూడా వారికి సంబందించిన ప్రత్యేకమైన ప్రదేశం.
సీతారాములు విహారం కోసం ఈ కొండపైకి వచ్చారట. అప్పుడు సీతామాతకు విపరీతమైన దాహం వేసిందట. ఆమె అవస్థ చుసిన శ్రీ రాముడు తన ధనుస్సు తీసుకుని ఒక బాణమును ఆ కొండయొక్క ఒక రాతి మీద ప్రయోగించారట. అప్పుడు ఆ రాతినుండి ఎప్పటికీ ఎండిపోని ఒక జల బయటకు వచ్చినదట. సీత మాత ఆ జలముతో తన దప్పికను తీర్చుకొన్నదట. ధనుస్సు ఉంది ప్రయోగించబడిన బాణము కొనవలన జలము ఉద్భవించినది కనుక ఈ ప్రదేశమును ధనుష్కోటి అని పిలిచారట.
ఈవిధంగా చెప్పబడిన ఆ జలం నేటికి కూడా ఎండిపోకుండా ఉన్నది. ఐతే ఆ నీరు త్రాగుటకు వీలుగా లేవు. ఐతే ఆ జలమును మనం తలపై ప్రోక్షించుకొనుటకు యోగ్యంగా ఉన్నవి.
source: internet
శ్రీ సీతా రాముల పాద ముద్రలు కూడా ఇక్కడ చూడ వచ్చు. ఐతే ఇక్కడ వచ్చిన తరువాత అక్కడి ప్రకృతి రమణీయత అత్యంత అద్భుతం.
ధనుష్కోటికి మేల్కోటి చెలువ నారాయణుని దేవాలయం నుండి రాయగోపురం మీదుగా నడచి చేరుకొన వచ్చును. ఐతే ఆ కొండ ఎక్కటం అంత తేలిక ఐన విషయం కాదు. అ కొండ క్రింది వరకూ కావాలంటే మీ వీలును బట్టి ఏదయినా వాహనంలో చేరుకొన వచ్చును.
ఇక్కడ చూపించినది ఆ కొండ యొక్క క్రింది భాగం. ఆ ఫోటోలో కనిపిస్తున్నంతవరకు ఏదయినా వాహనంలో రావచ్చును.