చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉండుట వల్లనే మనం చంద్రమానం ప్రకారం కాలమును గణిస్తాం.
చంద్రుడు అమావాస్య నుండి మరో అమావాస్య వరకు పయనించే కాలమును నెల అంటారు. ఇది సుమారుగా 30 రోజుల సమయం పడుతుంది. చంద్రుడు తన సర్వకళలతో నిండుగా ఉండే రోజును పౌర్ణిమ అంటాం.
ఐతే ఆ పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షతంతో ఉంటాడో ఆ నెలకు పేరు ఆ నక్షతం ద్వారానే కలుగుతుంది. ఎలాగో చూద్దామా!

- చైత్రం - చంద్రుడు చిత్తా నక్షత్రం తో ఉంటాడు.
- వైశాఖం - చంద్రుడు విశాఖ నక్షత్రం తో ఉంటాడు.
- జ్యేష్టం -చంద్రుడు జ్యేష్టా నక్షత్రం తో ఉంటాడు.
- ఆషాడం -చంద్రుడు పూర్వ/ఉత్తర ఆషాడ నక్షత్రం తో ఉంటాడు.
- శ్రావణం - చంద్రుడు శ్రవణ నక్షత్రం తో ఉంటాడు.
- భాద్రపదం - చంద్రుడు పూర్వ/ఉత్తర భాద్ర నక్షత్రం తో ఉంటాడు.
- ఆశ్వియుజ - చంద్రుడు అశ్విని నక్షత్రం తో ఉంటాడు.
- కార్తీక - చంద్రుడు కృత్తిక నక్షత్రం తో ఉంటాడు.
- మార్గశిర - చంద్రుడు మృగశిర నక్షత్రం తో ఉంటాడు.
- పుష్యం - చంద్రుడు పుష్య నక్షత్రం తో ఉంటాడు.
- మాఘం - చంద్రుడు మఖ నక్షత్రం తో ఉంటాడు.
- ఫల్గుణ - చంద్రుడు పూర్వ/ఉత్తర ఫల్గుణ నక్షత్రం తో ఉంటాడు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి