శ్రీమద్భాగవత మహా పురాణంలో దక్షుని గురించి చెప్పారు. దక్షుడు అంటే మనకు తెలుసు మహాదేవుని మామగారు.
దక్షుని భార్య పేరు ప్రసూతి. ఆమె స్వయంభుమనువు కుమార్తె.
దక్షునికి ఆమె భార్య యందు కలిగిన అనేక మంది పుత్రికలలో 13 మంది పుత్రికలను ధర్మునకు ఇచ్చి వివాహం చేసారు. వారి పేర్లు
దక్షుని భార్య పేరు ప్రసూతి. ఆమె స్వయంభుమనువు కుమార్తె.
దక్షునికి ఆమె భార్య యందు కలిగిన అనేక మంది పుత్రికలలో 13 మంది పుత్రికలను ధర్మునకు ఇచ్చి వివాహం చేసారు. వారి పేర్లు
- శ్రద్ద
- మైత్రి
- దయ
- శాంతి
- తుష్టి
- పుష్టి
- క్రియ
- ఉన్నతి
- బుద్ధి
- మేధ
- తితిక్ష
- హ్రీ
- మూర్తి
నా ఆలోచన:
మన పెద్దలు ప్రతి విషయమును చదువుతున్న మన అందరికి అర్ధం అయ్యే విధంగా చక్కగా చిన్నగా ఆ రహస్యములను చెప్తారు. మనం చేసే ప్రతి చిన్న పనికి ఏవిధమైన ఫలితం లభిస్తుందో ఈ సందర్భంగా చెప్పారు అని నా అభిప్రాయం.
ఇక్కడ చెప్పిన 13 మంది దక్షుని పుత్రికలు నిజంగా స్త్రీలేనా? ఐతే అయి ఉండవచ్చు కానీ వారు ఈ పుత్రికలను ధర్మునకు ఇచ్చుట ద్వారా ఏమి ఫలమును పొందారని చెప్పదలచుకున్నారో చూద్దామా!
ఈ 13 మందిని ధర్మునకు ఇచ్చారు. ధర్ముని వల్ల వారికి కలిగిన సంతానం
- శ్రద్ద - శ్రుతము (వినవలసినది), : ధర్మమును శ్రద్దగా వినుము
- మైత్రి - ప్రసాదము (ప్రసన్నత/ అనుగ్రహము) : ధర్మము నందు మైత్రి (స్నేహం) తో ఉండుట వలన ప్రసన్నత కలుగును
- దయ - అభయము : ధర్మముతో కూడిన దయ వలన అభయము కలుగుతుంది
- శాంతి - సుఖము : ధర్మముతో కూడిన శాంతి వలన సుఖము లభిస్తుంది
- తుష్టి (సంతృప్తి) - సంతోషం : ధర్మం తో కూడిన సంతృప్తి వలన సంతోషం
- పుష్టి (బలము) - స్మయం (ఆశ్చర్యం) : ధర్మం తో కూడిన బలం వలన ఆశ్చర్యకరమైన ఫలితములు
- క్రియ (పని) - యోగము : ధర్మం తో చేసిన పని వలన ఆ పని తప్పని సరిగా యోగిస్తుంది
- ఉన్నతి - దర్పము : ధర్మం తో కలిగిన ఉన్నతి వలన దర్పం ప్రప్తిస్తున్నది
- బుద్ధి - అర్ధం (లాభం/ ప్రయోజనం) : ధర్మం తో కూడిన బుద్ధి వలన లాభం కలుగుతుంది
- మేధ - స్మృతి (జ్ఞాపకం) : ధర్మం కలిగిన మేధ వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది
- తితిక్ష(ఓర్పు) - క్షేమము : ధర్మం తో కూడిన ఓర్పు సర్వదా క్షేమకరం
- హ్రీ (లజ్జ/సిగ్గు)- అనునయము : ధర్మముతో కూడిన సిగ్గుకు సర్వదా అనునయము చేరుతుంది
- మూర్తి (రూపం)- నరనారాయణులు : మనలో ధర్మం సాంతం మూర్తీభవించి ఉన్నట్లయితే భగవత్ స్వరూపం మనలను కాపాడుతూనే ఉంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి