గోకర్ణం లో ని శివలింగమును అక్కడ ప్రతిష్టించినది బాలగణపతి అని చెప్తారు. ఐతే అక్కడే ఎందుకు ప్రతిష్టించారు?
ఒకానొక సమయంలో రావణాసురుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసాడు. తన తపస్సుకు మెచ్చి తనముందు ప్రత్యక్షమైన శివుని తనతో తన పురమైన లంకకు రమ్మని అడిగాడు. దానికి శివుడు ప్రతిగా తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు. తనకు, తన ఆత్మలింగమునకు అభేదం అని చెప్పారు. ఐతే ఆ లింగమును ఎక్కడ భూమిమీద పెడితే అది అక్కడే ప్రతిష్టితమైనట్లు, దానిని మరలా కదిలించుట అసాధ్యం అని కూడా చెప్పారు.
రావణాసురుడు ఆనందంగా ఆ ఆత్మలింగమును స్వీకరించి తన లంకాపురమునకు దక్షిణదిశగా ప్రయాణం సాగించాడు.
అల కొంత దూరం వెళ్ళాక (గోకర్ణం వద్ద) సంధ్యా సమయం అయినది. ఆటను స్వయంగా బ్రాహ్మణుడు కావటం వల్ల ఆటను సంధ్యావందనం చేసి తీరాలి. కనుక ఎవరైనా ఆ ఆత్మలింగాన్ని పట్టుకుంటే ఆటను సంధ్యావందనం చెయ్యొచ్చు అని చూడసాగాడు.
ఈ సమయం కోసం ఎదురుచూస్తున్న గణపతి అక్కడకు ఒక బ్రాహ్మణ యువకుని రూపంలో అక్కడకు వచ్చాడు. ఆ బాలకుని చూసిన రావణాసురుడు ఆ ఆత్మలింగమును ఆ బాలకునికి ఇచ్చి దానిని జాగ్రత్తగా పట్టుకోమని చెప్పారు. ఒకవేళ ఆ బాలుడు దానిని పట్టుకోలేకపోతే తనను పిలువమని, ఆ బాలుడు 3సార్లు పిలచేలోపు ఆటను వచ్చి స్వయంగా ఆ లింగమును తీసుకుంటాను అని చెప్పాడు. బాలకుని రూపంలో ఉన్న వినాయకుడు అలాగే అని ఒప్పుకున్నాడు. రావణాసురుడు సంధ్యావందనం చేసుకోనుతకోసం కొంచెం దూరంగా వెళ్ళాడు. ఆటను అలా వెళ్ళగానే బాలుడు వెంటవెంటనే 3సార్లు రావణాసురుని పిలిచాడు. రావణాసురుడు అతని పిలుపు విని అక్కడకు వచ్చేంతలో ఆ బాలుడు ఆ ఆత్మలింగాన్ని అక్కడ ఉంచేశాడు. ఆ తరువాత రావణాసురుడు ప్రతిష్టించబడిన ఆ లింగమును కదిలించే ప్రయత్నం చేసాడు. కాని ఆ ప్రయత్నం విఫలమైనది. చేసేది ఏమిలేక రావణాసురుడు మరలి వెళ్ళిపోయాడు.
ఈ కధను మరోవిధంగా కూడా చెప్తారు.
గణపతి అక్కడ గోపాలకుని వేషంలో అక్కడ ఉన్నారని, రావణాసురుడు లఘుశంక కు వెళ్ళవలసి వచ్చినందున అతనికి ఆత్మలింగమును ఇచ్చారని, అప్పుడు ఆ బాఉదు లింగమును కింద ఉంచారని.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి