మనకు భగవంతుడిని ఆరాధించుట తెలుసు. ఆ ఆరాధన నమ్మకంతో కూడినది ఐతే దానిని మనం భక్తి అంటాం. మన శాస్త్రముల ప్రకారం భక్తి తొమ్మిది రకములు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.
- శ్రవణం : భగవంతుని కధ లను శ్రద్దగా వినుట
- కీర్తనం : భగవంతుని గురించి పాటలు పాడుట
- స్మరణం : సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని తలుచుకొనుట
- పాదసేవనం : నిరంతరం భగవంతుని పాదములయందు మనసునిలుపుట
- అర్చన : పూజాది విధుల ద్వారా భగవంతుని నిరంతరం సేవించుట
- నమస్కారము : మనస్పూర్తిగా భగవంతునికి నమస్కారము చేయుట
- దాస్యము : భగవంతుని దాసునిగా నిరంతరం తనను తాను భావించుకొనుట
- సఖ్యము : అన్ని కష్టములలో భగవంతుని తన స్నేహితునిగా భావించుట
- ఆత్మ నివేదనం : భగవంతునికి తనను తాను సమర్పించుకొనుట
మనకు పురాణములలో, చరిత్రలో ఒక్కో భక్తికి అనేక ఉదాహరణలుగా అనేక మంది కనిపిస్తారు. వారిలో కొందరిని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను.
- శ్రవణం : పరిక్షిత్తు
- కీర్తనం : రామదాసు
- స్మరణం : ప్రహ్లాదుడు
- పాదసేవనం : లక్ష్మీదేవి
- అర్చన : అదితి
- నమస్కారము : అక్రూరుడు
- దాస్యము : హనుమంతుడు, నందీశ్వరుడు
- సఖ్యము : అర్జునుడు, ఉద్ధవుడు, గుహుడు, సుగ్రీవుడు
- ఆత్మ నివేదనం : గోపికలు, మీరభాయి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి