అర్జునుని నామములు మనం సహజంగా పిడుగులు పడుతున్నపుడు చదువుతాము. ఆ సమయం లో ఈ పది నామములు చదివితే మనకు దగ్గరలో పిడుగులు పడవు అని సక్షాత్తు ఇంద్రుడే చెప్పాడు అని చెప్తారు. ఇప్పుడు అట్టి పది నామముల గురించి తెలుసుకుందాం!
- అర్జున : కన్నులకు సొంపైన, సుందరమైన శరీర కాంతి కలవాడు
- ఫల్గుణ : పూర్వ ఫల్గుణ, ఉత్తర ఫల్గుణ నక్షత్రముల మద్య సంధ్య కాలమున పుట్టినవాడు
- పార్ధ : పృధ (కుంతీదేవి అసలు పేరు) కు జన్మించిన వాడు
- కిరీటి : ఇంద్రుని చేత ప్రసాదించిన కిరీటం కలిగినవాడు
- శ్వేతవాహన : తన రధానికి ఎల్లప్పుడూ తెల్లని గుర్రములు కలిగిఉండే వాడు
- భీభత్స : యుధం చేస్తున్నప్పుడు సర్వం మర్చిపోయి అతనిని చూడాలనిపించే కౌశలం కలవాడు
- విజయ : ఓటమి తెలియని వీరుడు
- జిష్ణ : తాను ఆయుధం పట్టి ఉండగా తన అన్నధర్మరాజు మీద ఎవరైనా బాణప్రయోగం చేస్తే వారిని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసాడు కనుక జిష్ణుడు
- సవ్యసాచి : రెండుచేతులతో బాణ ప్రయోగం చేయగలిగిన వాడు
- ధనుంజయ : రాజసూయ యాగ సమయం లో సర్వ రాజ్యములను గెలిచి ధనమును తెచ్చిన వాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి