రామాయణం రచించటానికి ముందు,
అసలు వాల్మీకి ఏమి కోరుకున్నారు? రామాయణం ఆయన ఎలా రాయగలిగారు? రాముని చరిత్ర వాల్మీకికి ఎవరు చెప్పారు? ఎందుకు?
లోకంలో మంచి గురువు దొరకటం అదృష్టం. కాని ఆ గురువు యొక్క విశిష్టత గొప్ప శిష్యుని వల్ల మాత్రమే గుర్తింపబడుతుంది.
అగ్నిశర్మ వాల్మికిగా మారి తపస్సు చేస్తూ ఉన్న సమయం లో ఒక రోజు నారద ముని వారి ఆశ్రమానికి వచ్చాడు. నారద మునిని చుసిన వాల్మీకి మహర్షి వారికి సపర్యలు చేసి తన మనస్సు లో తిరుగుతున్న ప్రశ్నను ఆయన ముందు ఉంచారు.
మహానుభావా! ఈ కాలం లో నేను నా మాంసనేత్రం తో చూడగలిగేలా 16 సుగుణములు ఉన్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారా?

- గుణవంతుడు
- వీర్యవంతుడు
- ధర్మాత్ముడు
- కృతజ్ఞుడు
- సత్య వాక్య పరిపాలకుడు
- సత్చరిత్ర
- దృడసంకల్పం కలవాడు
- సత్ప్రవర్తన
- అన్ని జీవుల పట్ల సమదృష్టి కలవాడు
- సర్వాంగ సుందరుడు
- ధైర్య వంతుడు
- కోపాన్ని గెలిచిన వాడు
- అపార కంతి కలవాడు
- అసూయ లేనివాడు
- కోపం నటించగల వాడు
- విధ్యావంతుడు
ఆ ఆతురతతో, తెలుసుకో వలసిన విషయం గురించి వాల్మీకి లో ఉన్న ఉద్వేగం గమనించి, నారదుడు రామాయణ రచనాసమయం ఆసన్నమైంది అని భావించి 100 శ్లోకములతో కూడిన సంక్షేప రామాయణాన్ని (దాన్నే మనం మాలా మంత్రం అని కూడా అంటాం)చెప్పాడు.
ఆ 100 శ్లోకాలని మననం చేసి చేసి వాల్మీకి రామాయణం రచన చేసారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి