ఉన్న ఊరు, కన్న తల్లి, పుట్టిన దేశం వదలి విదేశాలకు ప్రయాణం. బ్రతుకు తెరువు కోసం కొందరు,చదువుల కోసం ఇంకొందరు. వందల, వేల, లక్షల మైళ్ళ దూరం ప్రయాణం. అక్కడ బయలుదేరినప్పుడు ఎంతో సాధించాం అనే అనందం పరాయి దేశం లో మొదటి అడుగు పడే సమయానికి ఆవిరి ఐపొతుంది.
రూపాయిలలో పోల్చినపుడు ఆరంకెల జీతం మనసుకు రెక్కలను ఇస్తుంది. మన ఊర్లో తాతయ్య 'ఇంకేమి మనవడా డాలర్లు సంపాదిస్తునావు' అనగానే అనుకోకుండానే మొహం మీద గర్వం తో కూడిన చిన్న చిరునవ్వు వికసిస్తుంది. ఎక్కడకు వచ్చాక గాని గుర్తుకు రాదు అసలు విషయం. ఆదాయమే కాదు ఖర్చు కూడా డాలర్ల లోనే ఉంటుందని.
బిక్కు బిక్కు మంటూ ఒంటరిగా మొదలుపెట్టిన ప్రయణం, మన వాళ్ళు అని ఎవరైనా కలవరా అని ధైర్యం ఇస్తుంది.
ఏ చైనా దేశస్తుడో, కొరియా వ్యక్తో్ కనిపిస్తే అయ్యొ మన భారతీయులు కనిపిస్తే బాగుండేది అనిపిస్తుంది. అదే ఒక భరతీయుడు కర్నాటక వళ్ళు కలిస్తే అయ్యొ మన తెలుగు వాళ్ళు కలవలేదే అనిపిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి