హైందవ సంప్రదాయ ప్రకారం ఈ సకల సృష్టి పంచభూతములనుండి ఉద్భవించింది. ఈ సృష్టి లో ఏ పదార్ధం తీసుకున్న అది ఈ పంచభూతముల అనుసంధానమే అయ్యి ఉంటుంది. ఆ పంచభూతములుగా వారు చెప్పినవి
1. ఆకాశం
2. వాయువు
3. అగ్ని
4. జలం
5. భూమి
ఈ నాటి శాస్త్రవేత్తలు మొత్తం మీద ఉన్న పదార్ధములను వాని భౌతిక ధర్మాలను అనుసరించి ముఖ్యంగా మూడు రకాలుగానూ, విపులంగా సిచూసినప్పులేదు ఐదు రకాలుగాను చెప్పారు. వారి ప్రకారం ఏ పదార్ధమయిన ఈ ఐదు రకములలో ఒకటిగా లేక, వాని మిశ్రమంగా ఉంటుంది. అవి
1. ఘనములు
2. ద్రవములు
3. వాయువులు
4. ప్లాస్మా
5. బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్
ఇప్పుడు మనం పైన చెప్పుకున్న రెండు రకముల ను పోల్చి చూద్దాం!
1. ఘనములు - భూమి : ఘనం-భూమి ఒకే లక్షణములు కలిగి ఉంటాయి. ఈ రెడింటికి నిర్దిష్టమయిన ఆకారం, ఘనపరిమాణం ఉంటాయి. వాని అణువు లు చాలా దగ్గరగా ఉంటాయి.
2. ద్రవములు - జలం: ఈ రెండు నిర్దిష్టమయిన ఘనపరిమాణం కలిగి ఉంటాయి కానీ నిర్దిష్టమయిన ఆకారం కలిగి ఉండవు. వాని అణువులు ఘనముల అణువులతో పోల్చిచూసినప్పుడు దూరంగాను, వాయువుల అణువులతో పోల్చి చూసినప్పుడు దగ్గరగాను ఉంటాయి.
3. వాయువులు - వాయువు : వీనికి నిర్దిష్టమయిన ఆకారం కానీ ఘనపరిమాణం కానీ ఉండవు. వీని అణువులు ఒకదానికి ఒకటి దూరంగా ఉంటాయి.
4. ప్లాస్మా - అగ్ని : సూర్యునిలో ఉండే మండి పోయే వాయువులను ప్లాస్మా గా గుర్తించ వచ్చు. అవి నిరంతరం శక్తిని, కాంతిని విలువరిస్తూ ఉంటాయి. వీనికి అత్యంత శక్తి ఉంటుంది. నిరంతరం చలిస్తూనే ఉంటాయి.అందుకే దీనిని మనం అగ్నితో పోల్చ వచ్చు.
5. ఆకాశం - బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్ : గాలికంటే లక్ష రెట్లు తేలికయిన పదార్ధాన్ని బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్ అంటారు. అంటే ఆ పరిస్థితిలో ఉన్న ఏ పదార్ధమయిన దానికి ఉండవలసిన పరిమాణం కంటే చాలా తక్కువ పరిమాణమును కలిగి ఉంటుంది కనుక దీనిని మనం ఆకాశం తో పోల్చవచ్చు. ఇవి అత్యంత తక్కువ శక్తిని కలిగి ఉంటాయి.
కాబట్టి ఈ కాలంలో మనం చెప్పుకుంటున్న అనేక విషయాముల గురించి మనకంటే ఎన్నో వేల సంవత్సరముల ముందే మన ఋషులు అత్యంత సహజంగా సామాన్య మానవునకు అర్ధమయ్యే భాషలో చెప్పారు.