సుకాలినులు అనే పితృ దేవతలు మూర్తగణములు. వీరు ద్యులోకం పైన నక్షత్రకాంతిలో ప్రకాశించు జ్యోతిర్భాసి అనే లోకంలో నివసిస్తారు. వీరి తండ్రి గారు వశిష్ఠుడు. వీరిని శ్రాద్ధకాలంలో బ్రాహ్మణులు పూజిస్తారు. వీరి మానస పుత్రి పేరు గౌ:
Deepika's neerajanam is discussing about the ideas of hindu mythology concepts and its inner meanings, puranams, itihasams, historical concepts, prabaandhamulu, sanskrit, telugu kavyams, telugu padyamulu, neeti kadhalu, intresting concepts and their symbolisms, predictions, interpretations aand many more knowledge filled posts.
27, జూన్ 2019, గురువారం
25, జూన్ 2019, మంగళవారం
ఆజ్యపులు
ఆజ్యపులు అనే పితృగణములు మూర్తగణములు . వీరు పులహుని పుత్రులు కొందరు, కర్దమ ప్రజాపతి పుత్రులు కొందరు. వీరు నివసించు లోకము సర్వ కామనాలు చక్కగా తీర్చే కామదుఘాము అనే లోకము. వీరిని శ్రాధ సమయములో వైస్యులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు విరజ. ఈమె నహుషునికి భార్య, మహారాజు యయాతి కి తల్లి.
23, జూన్ 2019, ఆదివారం
హవిష్మంతులు
హవిష్మంతులు అనే పేరుగల పితృగణము మూర్తగణము. వీరి తండ్రి అంగీర: ప్రజాపతి. వీరు నివసించు లోకము సూర్యమండలములో గల మరీచి గర్భములు, అంటే లోపలవైపునకు కూడా కిరణములు కలవి అని అర్ధము కలిగిన లోకములు. వీరిని శ్రాద్ధములు జరిపించు క్షత్రియులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు యశోద.
ఆమె సూర్యవంశమునకు చెందిన అంశుమంతుడు అనే రాజునూ వివాహం చేసుకున్నది. వారికి జన్మించిన పుత్రుడు దిలీపుడు. దిలీపుని పుత్రుడు భగీరధుడు. సాక్షాత్తు ఆకాశగంగను భూమి మీదకు తెచ్చినది ఇతనే.
ఆమె సూర్యవంశమునకు చెందిన అంశుమంతుడు అనే రాజునూ వివాహం చేసుకున్నది. వారికి జన్మించిన పుత్రుడు దిలీపుడు. దిలీపుని పుత్రుడు భగీరధుడు. సాక్షాత్తు ఆకాశగంగను భూమి మీదకు తెచ్చినది ఇతనే.
21, జూన్ 2019, శుక్రవారం
సోమపులు
మనం ఇంతకు ముందు 7గురు పితృ దేవతల పేర్లు వారిలో ఆమూర్తగణముల గురించి తెలుసుకున్నాం కదా! ఇపుడు మూర్త గణముల గురించి తెలుసుకుందాం! వారిలో మొదటి గణము సోమపులు.
వీరు స్వధాకారము నుండి జన్మించారు. వీరు బ్రహ్మ లోకములోని మానసములు అనే లోకములో నివసిస్తారు. వీరు అనంతమయిన యోగ సిద్ధి చేత బ్రహ్మత్వము పొందారు. వీరి పుత్రిక పేరు నర్మద, ఈమె సకల జలములకు ప్రతీక.
ఈ సోమపులు సకల పితృదేవతల కు ప్రతీకలు కనుకనే శ్రాద్ధము చేసే తప్పుడు స్వధాకారం చెప్తారు మరియు జలముల దగ్గర తర్పణములు చేస్తారు.

19, జూన్ 2019, బుధవారం
బర్హిషదులు
ఈ పితృగణము అమూర్త గణము. వీరి తండ్రి పులస్త్యుడు.వీరు నివసించు లోకము ధ్యు లోకంలోనే కాంతివంతములయిన మరికొన్ని లోకములు, విభ్రాజములు.
వీరిని అసుర, దానవ , గంధర్వ, అప్సరస యక్షులు, ధ్యు లోకములోని దేవతలు అందరూ ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు పీవరి. ఆమె యోగులకే యోగిని అనే చెప్తారు.
వీరిని అసుర, దానవ , గంధర్వ, అప్సరస యక్షులు, ధ్యు లోకములోని దేవతలు అందరూ ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు పీవరి. ఆమె యోగులకే యోగిని అనే చెప్తారు.
17, జూన్ 2019, సోమవారం
అగ్నిష్వాత్తులు
15, జూన్ 2019, శనివారం
వైరాజులు
పితృదేవతలలో ఆమూర్తి గణములలో మొదటి వారు వైరాజులు. వారి తండ్రి పేరు విరాజుడు. వీరు నివసించు లోకము ద్యు లోకము. వీరిని మానవ దేవతా భేదం లేకుండా అందరూ ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు మేన దేవి.ఈమె ఒకానొక శాపం కారణంగా భూలోకమునకు రావలసి వచ్చి, హిమవంతుడిని వివాహం చేసుకున్నది. ఆ తరువాత ఆమె పార్వతిదేవికి తల్లి అయినది.
13, జూన్ 2019, గురువారం
పితృ దేవతలు - సత్యవతి
ఇంతకు ముందు మనం పితృ దేవతలు , వారి పుత్రిక అమావస్య గా ఎందుకు పిలవ బడుతుంది అని తెలుసుకున్నాం కదా !
ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఆమెకు పితృదేవతలు ఇచ్చిన శాపం గురించి కూడా తెలుసుకున్నాం! ఆమెను భూలోకంలో మానవజన్మ నెత్తమని వారి శాపం. వారి శాపమును విన్న అమావస్య అత్యంత బాధకు, పశ్చాతాపమునకు లోనయ్యి ఆ శాపమునకు కలుగు ఉపశమనమును తెలుపమని కోరినది. భూత భవిష్య వర్తమాన కాలములను తెలుసుకొనగలిగిన ఆ పితృ దేవతలు ఆమెకు జరుగబోయే విషయములను చక్కగా వివరించారు.
ఆమె 28వ ద్వాపరయుగములో ఒక దివ్య పురుషునకు జన్మనివ్వవలసి ఉన్నది. అతను మాత్రమే తరువాత వచ్చు అనేక అల్పబుద్ధి, అల్ప ఆయుష్షు కల్గిన మానవులను కాపాడే విధంగా వేదములను విభాగం చేయగలడు. అయితే అతని జననం వలన ఆమె కన్యత్వం చెడదు. ఆ తరువాత ఆమె సముద్ర అంశతో జన్మించిన శంతనుడు అనే ఒక మహారాజును వివాహం చేసుకుంటుంది.
తెలిసింది కదా ఆమె ఎవరో! ఆమే మత్స్య గంధి, యోజన గంధి అని పిలువ బడే సత్యవతి.

11, జూన్ 2019, మంగళవారం
పితృ దేవతలకు అమావస్య తిధి ఎందుకు ఇష్టమంటే ...!
మనం ఇంతకు ముందు పితృదేవతలు 7 గణములని వారి పేర్లు చెప్పుకున్నాం కదా! వారిలో అగ్నిష్వాత్తులు అనే పితృదేవతలకు ఆచ్చోదా అనే మానస పుత్రిక ఉన్నది. ఆమె ఒక వెయ్యి దివ్య సంవత్సరములు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన పితరులు సంతుష్టులై ఆమెను వరం కోరుకొమ్మని అడిగారు. అయితే వచ్చిన ఆ పితృదేవతలలో మావసుడు అనే వానిని ఆమె వరించింది. ఆమె చేసిన ఈ ధర్మ దూరమయిన పనికి ఆ పితృ దేవతలు ఆమెను భూలోకములో జన్మించమని శపించారు.
అయితే ఆ మావసుడు ఆమెను పుత్రికా దృష్టితో చూసినందువలన ఆమె మావాస్య కాలేదు. అంటే ఆమె అమావాస్య అయినది. ఆమె చేసిన తపస్సును పితృదేవతలు మెచ్చారు కనుక అమావస్య తిధి రోజు పితరులకు అర్పించినది ఏదయినా అక్షయము అవుతుంది.

9, జూన్ 2019, ఆదివారం
పితరులు
శ్రాద్ధము మొదలయిన కర్మలలో మనకు తరచుగా వినిపించే పేరు పితృదేవతలు. అయితే వారు ఎవరు? దీనికి సమాధానము హరివంశములో చెప్పారు.
దీనికి అర్ధం : రూపము కలిగిన వారును, రూపము లేనివారూ, అత్యంత ప్రకాశవంతమయిన తేజస్సు కలిగినవారు, యోగ శక్తి సంపన్నమయిన కన్నులతో, ధ్యానము ద్వారా అన్ని విషయములగురించి తెలుసుకోగలిగినవారు , అటువంటి యోగ చక్షువులు కలిగినవారి చే ధ్యానింప బడే వారు అయిన పితృ దేవతలకు సదా నమస్కరింతును.
అంటేఅనేక గణములుగా ఉన్న పితరులతో కొందరికి రూపములు ఉన్నాయి మరి కొందరికి లేవు. మొత్తం పితర గణములు 7. వానిలో
అమూర్త గణములు : రూపములు లేని వారు
అమూర్తానాంచ ముర్తానాం పితౄణం దీప్తతేజసం
నమష్యామి సదాతేషాం ధ్యాయినాం యోగ చక్షుషా !
అంటేఅనేక గణములుగా ఉన్న పితరులతో కొందరికి రూపములు ఉన్నాయి మరి కొందరికి లేవు. మొత్తం పితర గణములు 7. వానిలో
అమూర్త గణములు : రూపములు లేని వారు
మూర్త గణములు : రూపములు ఉన్నవారు