మన సనాతన ధర్మంలో
దేవాలయముల పాత్ర అత్యంత ప్రముఖమైనది. పూర్వకాలంలో దేవాలయములు కేవలం భగవంతుని పూజా స్థలములుగానేకాక
అనేక సామాజిక కార్యకలాపాలకు కూడా నెలవులుగా ఉండేవి. ఆ రోజులలో దేవాలయాలు ఏవిధంగా ఉపయోగ
పడేవో చుద్దాం!
- వేద
విధ్యాలయాలు : ఆ రోజులలో ప్రతి దేవాలయంలో అనేక విధ్యార్ధులు నిత్యం
వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. వారికి దేవాలయమును మించి మరొక స్థానం అవసరం ఏముంది?
- విధ్యావేత్తల
సమావేశములు : ఆ రోజులలో శాస్త్ర చర్చలకు, అవధానములకు, పండితుల
మద్య వాదములకు దేవాలయములు వేదికలుగా మారేవి
- కళలు : లలిత కళలకు దేవాలయములు పట్టుకొమ్మలు. నాట్యములు,
గానములు, వాద్యములుకు సంబందించిన ప్రతిఒక్కరు దేవాలయములలో తమ ప్రదర్శనలు ఇస్తూండేవారు
- శిలాశాసనములు : పూర్వ కాలంలో రాజులు తాము చేసిన గొప్ప పనులను,
ఆయా దేవాలయములకు చేసిన సేవలను తరువాతి తరముల వారికి అందించే ప్రయత్నంలో భాగంగా దేవాలయములలో
శిలాశాసనములు లేదా రాగిపత్రములు వేయించేవారు. కనుక దేవాలయములు మన చరిత్రకు సాక్షులు
- స్థూపములు,
శిల్పములు, చిత్రలేఖనం : పైన చెప్పిన శిలాశాసనముల వలెనే ఈ స్థూపములు, శిల్పములు, చిత్రలేఖనం
కూడా చరిత్రకు సాక్షములు.. అయితే వీని ప్రముఖ్యం ఆ రాజుల సమయంలో కళల స్వరూపమును మనకు
తెలియజేస్తాయి
- గోదాములు
: అప్పట్లో దేవాలయముల ఆవరణ చాలా పెద్దగా ఉండుట వల్ల రైతులు ఆ ఆవరణను కొంతమేర ధాన్యమును
నిల్వచేసుకునే గోదాములుగా వాడుకునేవారు
- చికిత్సా
కేంద్రాలు : ఆ రోజులలో మనకు ఇప్పుడు ఉన్నట్లుగా
వైధ్యశాలలు ఉండేవి కావు. ఆచార్యుల వారి ఇంటిలో లేదంటే దేవాలయంలోనే అన్ని వైద్య సేవలు
అందేవి.
- గ్రామ
సమావేశములు : ఆయా గ్రామములకు సంబందించిన ముఖ్య విషయముల చర్చలు దేవాలయములు వేదికగా జరిగేవి.
- ఎన్నికల
కేంద్రములు : ఆయా గ్రామములలో జరిగే ఏ విధమైన ఎన్నికలయినా దేవాలయ ప్రాంగణాములలో జరిగేవి.
- అర్ధిక కార్యకలాపములు : ఊరికి సంబందించి చేసే ప్రతి కార్యక్రమానికి సంబందించిన
ఆర్ధిక పరమైన చర్చలకు, భవిష్య ప్రణాళిక లకు దేవాలయములు కేంద్రములయ్యేవి
ఇన్ని ముఖ్యమయిన
పనులు అన్నీ దేవాలయములలోనే జరుగుటకు, అలా జరగాలని నిర్ణయించుటకు ముఖ్యమయిన కారణం పైన
చెప్పిన పనులన్నీ ధర్మబద్ధంగా జరగాలనే.